కొల్లాపూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో రంజాన్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈద్గా, దర్గాలలో ముస్లింలు చిన్నాపెద్దా భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. ఈ ప్రార్థనల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.