కొలంబియాలో పడవ ప్రమాదం

కొలంబియాలో పడవ ప్రమాదం జరిగింది. 150 మంది ప్రయాణికులతో ఉన్న ఓ పడవ ఒక్కసారిగా నీట మునిగింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే చనిపోగా… 30 మంది గల్లంతయ్యారు. వెంటనే అలర్టయిన నేవీ సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. 20 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. మెడ్లిన్‌ కు 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాశయంలో ఈ ప్రమాదం జరిగింది.