కొత్తగా 21 ఎస్టీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు

రాష్ట్రంలో ఎస్టీల కోసం కొత్తగా 21 డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మంత్రి చందూలాల్‌, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకున్నారు.

కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎస్టీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు:

ఖమ్మం (బాలికలు), కొత్తగూడెం (బాలికలు), మణుగూరు (బాలురు), మహబూబాబాద్‌ ( బాలికలు), ములుగు (బాలికలు), మరిపెడ (బాలురు), జనగామ (బాలికలు), ఆదిలాబాద్‌ (బాలురు), ఉట్నూరు (బాలికలు), ఆసిఫాబాద్‌ (బాలికలు), నిజామాబాద్‌ (బాలికలు), కామారెడ్డి (బాలురు), సంగారెడ్డి (బాలురు), మెదక్‌ (బాలికలు), రంగారెడ్డి (బాలికలు), మహబూబ్‌నగర్ (బాలికలు), నాగర్‌కర్నూల్‌ (బాలురు), సూర్యాపేట (బాలికలు), దేవరకొండ (బాలికలు), సిరిసిల్ల (బాలికలు), కరీంనగర్‌ (బాలురు).