కేరళలో విష జ్వరాల విజృంభణ, 103 మంది మృతి

వర్షాలు ప్రారంభం కావడంతో కేరళలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు 103 మంది విష జ్వరాలతో మృతి చెందారు. విష జ్వరాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో, అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం పరిశుభ్రతపై దృష్టి పెట్టింది. మాస్ శానిటేషన్ డ్రైవ్ లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.