కేటీపీఎస్ లో కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ

సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో కరెంటు సమస్యల్ని అధిగమించామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.  ఇప్పటికే వ్యవసాయానికి 9 గంటల కరెంటును ఇస్తున్నామని.. వచ్చే సీజన్ నుంచి 24 గంటలు విద్యుత్‌ ను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా విద్యుత్ ఉద్యోగులు పని చేయాలని కోరారు. కేటీపీఎస్‌ లో పని చేస్తున్న 40 మంది కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వ ఉత్తర్వులను ఉద్యోగులకు అందజేశారు.