కేటీఆర్ ఐటీ మంత్రి కావడం తెలంగాణ అదృష్టం

ఇటీ మినిస్టర్ కేటీఆర్  పై  మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. కేటీఆర్ ఐటీ మంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. రాష్ట్రాన్ని కేటీఆర్  ఇండస్ట్రీయల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శ్రమ వల్ల కొత్త పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు కోసం కృషి చేసిన మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఎందరో ముందుకు వస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శ్రమ వల్ల కొత్త పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటుతో వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అంతే కాకుండా వైద్యం కూడా తక్కువ ధరలో అందుతుందన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ లేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయిందన్నారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. ఉద్యమంలో ప్రదర్శించిన స్ఫూర్తినే రాష్ర్టాభివృద్ధి కోసం కూడా కొనసాగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో  మెడికల్ డివైజెస్ పార్క్ కు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు పాల్గొన్నారు.