కేంద్ర చట్టం నుంచి ఐదు ప్రాజెక్టులకు మినహాయింపు

కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టం-2013లోని 2,3 అధ్యాయాలను రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు మినహాయిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో కాళేశ్వరం, ప్రాణహిత, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నాయి. భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు వ్యయం పెరగకుండా ఉండేందుకే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2016 రాష్ట్ర భూసేకరణ చట్టంలోని అంశాల ఆధారంగా గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.