కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో మంత్రి కేటీఆర్ భేటి

కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్ జైట్లీతో ఐదు అంశాలపై చర్చించానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీఎస్టీ నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, బీడి పరిశ్రమ, చిన్న, మధ్యతరహా గ్రానైట్ పరిశ్రమలకు కొంత మినహాయింపు ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశానన్నారు. సీఎస్టీ పరిహారం రూ.350 కోట్లు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి పెండింగ్ నిధులు రూ.450 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరామన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణకు రక్షణ శాఖకు చెందిన స్థలాల బదలాయింపును వేగవంతం చేయాలని కోరామని తెలిపారు. ఈ అంశంపై రక్షణ శాఖ కార్యదర్శితో కేంద్ర మంత్రి చర్చించారని, తాను కూడా సెక్రటరీని కలిసి కంటోన్మెంట్ ఏరియాలో స్థలాల బదలాయింపుపై చర్చిస్తానని మంత్రి కేటీఆర్ చెప్పారు.