కేంద్రమంత్రి మేనకకు అనారోగ్యం

కేంద్ర మంత్రి మేనకా గాంధీ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ లో పర్యటిస్తున్న ఆమె అనారోగ్యం పాలుకావడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. మేనకా గాంధీ గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారని, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తామని అధికారులు చెప్పారు. అయితే, మేనకకు శ్వాస సంబంధమైన అనారోగ్యం ఉందని వార్తలు వచ్చాయి. వాటిని అధికారులు ఖండించారు.