కేంద్రమంత్రి గడ్కరితో ఎంపీ కవిత భేటి

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. నిజామాబాద్-జగదల్ పూర్ మధ్య మైనర్ బ్రిడ్జిని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ కవిత విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.