కాసేపట్లో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం

కాసేపట్లో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలుకానుంది. ఇప్పటికే పార్లమెంట్  సెంట్రల్‌  హాల్‌  లో ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు  పూర్తయ్యాయి. రాత్రి 10 గంటల 45 నిమిషాలకు మొదలుకానున్న ఈ కార్యక్రమం 75 నిమిషాల పాటు కొనసాగనుంది. రాష్ట్రపతి రాకకు ముందు జీఎస్టీపై షార్ట్ ఫిల్మ్‌ ను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్‌, ఉప రాష్ట్రపతి హన్సారీ, ప్రధాని మోడీ, లోక్‌  సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, మాజీ ప్రధాని దేవెగౌడలు స్టేజీపైకి చేరుకుంటారు. అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌  జైట్లీ  జీఎస్‌టీ గురించి వివరిస్తారు.

ప్రధాని, రాష్ట్రపతి 25 నిమిషాల చొప్పున ప్రసంగిస్తారు. రెండు నిమిషాల వీడియో క్లిప్‌ ప్రదర్శించాక… సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్‌టీ అమలులోకి వచ్చిందనేందుకు సూచికగా పెద్ద గంటను మోగిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడి, ఆర్థిక మంత్రి జైట్లీ విందు ఇస్తున్నారు.