కామారెడ్డిలో మైనారిటీ గురుకులం ప్రారంభం

కామారెడ్డిలో పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. మొదట మైనార్టీ గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఆ తర్వాత గంజ్‌రోడ్‌, దేవినిపల్లి రోడ్‌ లో రెండు కో ఆపరేటివ్‌ బ్యాంకులను ప్రారంభించారు. కామారెడ్డి మండలం లింగాపూర్‌, పాతరాజంపేట, శాబ్దిపూర్‌ గ్రామాల్లో 5 కోట్ల 18 లక్షల రూపాయల ఖర్చుతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపనలు చేశారు.