కాంగ్రెస్, కరప్షన్ కవల పిల్లలు

కాంగ్రెస్, కరప్షన్ కవల పిల్లలని ఎద్దేవా చేశారు నిజామాబాద్ ఎంపీ కవిత. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచిస్తే.. కాంగ్రెస్ నేతలు కరప్షన్ గురించి ఆలోచిస్తారని విమర్శించారు. గజ్వేల్ తర్వాత ఆర్మూర్ కు మిషన్ భగీరథ జలాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మిషన్ భగీరథ ట్రయల్ రన్ ను ఎంపీ కవిత ప్రారంభించారు. అంతకుముందు డిచ్‌ ప‌ల్లి మండలం దేవ తండాలో జ‌గ‌దాంబ మాత ఆల‌యాన్ని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డితో క‌లిసి కవిత ప్రారంభించారు. అంగన్ వాడి భవనాన్ని కూడా ఆమె ప్రారంభించారు.