కత్రినాపై సినిమా తీస్తా!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌, హీరోయిన్‌ కత్రినాకైఫ్‌ ప్రేమాయణం అందరికీ తెలిసిందే. సల్మాన్‌ఖాన్‌ అయితే రణ్‌బీర్‌ను కత్రిన పెళ్లిచేసుకోబోతున్నట్టు  ప్రకటించాడు కూడా. రణ్‌బీర్‌ అక్క కరీనా కూడా పెళ్లి వార్తను కన్ఫామ్‌ చేసింది. అయితే హఠాత్తుగా తమ ప్రేమకు బ్రేకప్‌ చెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు. బ్రేకప్‌ తర్వాత వీరిద్దరూ కలిసి నటించి సినిమా ‘జగ్గా జాసూస్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో ఈ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన రణ్‌బీర్‌.. కత్రినను ఆకాశానికి ఎత్తేశాడు. “కత్రిన చాలా పెద్ద స్టార్‌. అమె నటించిన సినిమాలన్నీ సూపర్‌హిట్‌లుగా నిలిచాయి. ఆమె ఒక సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ మెషీన్‌. ఆమె తన గురించి తానే ఓ సినిమా తీసుకోగల స్థాయిలో ప్రస్తుతం ఉంది. ఒకవేళ నేను నిర్మాత అయితే ఆమె గురించి ఓ సినిమా తీస్తాను” అని అన్నాడు రణ్‌బీర్‌. రణ్‌బీర్‌ ప్రశంసలకు పక్కనే ఉన్న కత్రిన.. ‘థ్యాంక్స్‌ రణ్‌బీర్‌’ అని చెప్పింది.