ఓవరాక్షన్ చేస్తే బయటకు పంపడమే!

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఎవరైనా క్రికెటర్ మైదానంలో దూకుడుగా, వివాదాలకు తెరతీసినట్లుగా ప్రవర్తిస్తే అతన్ని బయటకు పంపే అధికారాలను అంపైర్లకు కట్టబెట్టారు. కుంబ్లే నేతృత్వంలోని కమిటీ దీన్ని ప్రతిపాదించగా ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.