ఏపీ సీఎం కుట్రలపై నిరసన

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆస్తులు, ఉద్యోగాలు, ప్రమోషన్లు కబ్జా చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ మండిపడ్డారు. ఏపీ కుట్రలకు నిరసనగా హైదరాబాద్ విద్యుత్ సౌధలో ధర్నా చేశారు. రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు దాటినా ఏపీ ఉద్యోగులను ఇక్కడి నుంచి రిలీవ్ చేయడం లేదని, కరెంట్ ఇవ్వనంటున్నారని మండిపడ్డారు. మీ ఉద్యోగుల్ని మీరు తీసుకోండి.. మా సీఎం అనేక కొత్త పోస్టులు భర్తీ చేస్తున్నారని నినదించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో చిచ్చుపెట్టాలని ఏపీ సీఎం చూస్తున్నారని టీఎన్జీవో గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్, టిఇఇఎ ప్రసిడెంట్ శివాజి మండిపడ్డారు.