ఎస్సై ఆత్మహత్య పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి

సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన దురదృష్టకరం అన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించి, ప్రజలకు రక్షణగా వుండే పోలీసులు మనో స్థైర్యాన్ని కోల్పోవద్దని, ఏ సమస్య ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి, అక్కడ సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీసులు రక్షణ కోసం వాడే తుపాకీతో తమ ప్రాణాలు తీసుకుంటుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.