ఎస్ఆర్ఎస్పీ కాలువలు పరిశీలించిన మంత్రి హరీశ్

రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు, ఆధునికీకరణ సంబంధించి గతంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం..  కాకతీయ ప్రధాన కాలువ స్థితిగతులను పరిశీలించారు. ఆటోనగర్ నుంచి డీబీఎం 54 కొత్తూరు, పెరికేడు, రావూరి తండా, అన్నారం షరీఫ్ గ్రామాల మీదుగా వెళ్లే ఎస్సారెస్పీ ప్రధాన కాలువను మంత్రి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని గమనించారు.  అక్కడి నుంచి డీబీఎం 60కి సంబంధించి మాటేడు చెరువు మీదుగా దంతాలపల్లి, దాట్ల, సన్నూరు మీదుగా సాగే కాలువను పరిశీలించారు. అనంతరం  ఎస్సారెస్పీ స్టేజ్-2కు సంబంధించిన కాలువ పనులను కురవి మండలంలో పరిశీలించి బేచిరాజుపల్లిలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత 2-30గంటలకు మరిపెడలో కొండ సముద్రం మినీట్యాంక్‌బండ్‌ను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగింస్తారు. ఆయన వెంట ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు, నాయకులు ఉన్నారు.