ఎయిర్  ఏషియాకు తప్పిన ముప్పు

మలేషియాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. మలేషియా నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న ఎయిర్  ఏషియా ఎయిర్  బస్‌ .. భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఒక్కసారిగా ఊగిపోయింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపంతో గాల్లో చక్కర్లు కొడుతూ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దాంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. విమానాన్ని దారి మళ్లించి పెర్త్‌   విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం వాషింగ్‌   మెషీన్‌  లాగ  ఊగిపోవడంతో తాము చాలా భయపడిపోయామని ప్రయాణికులు చెప్తున్నారు.