ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 60 గంటలపాటు కొనసాగిన  ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను డీజీ అవస్తి వెల్లడించారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు సైతం మృతిచెందినట్లు తెలిపారు. ఎదురుకాల్పుల్లో మొత్తం 500 మంది జవాన్లు పాల్గొన్నట్లు వెల్లడించారు.