రామ్ నాథ్ కోవింద్‌కు ఒడిషా సీఎం మద్దతు

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు తెలుపుతున్నట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రాష్ట్రపతి పదవిని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, అందుకే సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. బీజూ జనతా దళ్ నుంచి రామ్ నాథ్ కోవింద్ కు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. గతంలో పీఏ సంగ్మా అభ్యర్ధిత్వాన్ని బీజేడీ ప్రతిపాదించినప్పుడు బీజేపీ అంగీకరించిందని నవీన్ పట్నాయక్ గుర్తు చేశారు.