ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు

సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని మరోసారి నిరూపించారు. ఒక దళిత నేతను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంలో సీఎం  కీ-రోల్ ప్లే చేశారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు రామ్‌నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి ఖరారు చేసింది. ఈ విషయాన్ని  ప్రధాని మోడీనే స్వయంగా సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి తెలిపారు. బీజేపీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేశారు. ఒక దళిత నాయకున్ని రాష్ట్రపతిగా ఎంపిక చేయాలని మీరే సూచించారు కాబట్టి.. మీ సూచన మేరకే దళిత అభ్యర్థినే రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసినట్లు సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ చెప్పారు. అందుకే మీకు ముందుగా ఫోన్ చేస్తున్నానన్న మోడీ.. మీ పూర్తి మద్దతు కోరుతున్నామని తెలిపారు. అటు ప్రధాని వినతి మేరకు సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద పార్టీ సీనియర్లను సంప్రదించారు. ఒక దళిత నేతకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం వచ్చినందున సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

దేశ అత్యున్నత పదవికి దళిత అభ్యర్థిని ఎంపిక చేయడంలో చొరవ చూపించిన సీఎం కేసీఆర్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.