ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ పేరును ఖరారు చేసినట్లు చెప్పారు బీజేపీ చీఫ్ అమిత్ షా. ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాథ్…  గతంలో పలు కీలక పదవుల్లో పని చేసినట్లు తెలిపారు. ఆయన అభ్యర్ధిత్వంపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు, ఇతర విపక్ష పార్టీలకు తెలియజేశామన్నారు అమిత్ షా. దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ అభ్యర్ధిత్వాన్ని అన్ని పార్టీలు సమ్మతిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.