ఎన్డీఏ పాలనకు కళంకం తెచ్చే కుట్ర

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని, అయితే, ఈ పాలనకు కళంకం ఆపాదించేందుకు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు లేనిపోని విమర్శలు గుప్పిస్తున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆరోపించారు. వారి ఎత్తులు ఎంతమాత్రమూ  ఫలించవన్నారు. ఎన్డీఏ మూడేళ్ల పాలన విజయోత్సవాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ పార్టీ ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌లో పోలీసు కాల్పుల ఘటనకు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని వెంకయ్య చెప్పారు. 1998లో బెతుల్‌ జిల్లాలో జరిగిన పోలీసు కాల్పుల్లో 24 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల నేతలు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.