ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. బందిపొర జిల్లా సంబల్ లోని 45వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ క్యాంప్  ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి యత్నించారు. అప్రమత్తమైన బలగాలు.. కౌంటర్ ఎటాక్   కు దిగాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో ఈ అటాక్ జరిగింది. హతమైన ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.