ఉచితంగా కూరగాయల పంపిణీ

బంద్ కారణంగా నిత్యవసరాల కొరతతో ఇబ్బందులు పడుతున్న డార్జిలింగ్ వాసులకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసింది ఓ స్వచ్ఛంద సంస్థ. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తో  గూర్ఖా జనముక్తి మోర్చా డార్జిలింగ్ లో కొన్ని రోజులుగా బంద్ నిర్వహిస్తోంది. మరోవైపు ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు నిత్యవసరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రజల బాధలను కొంతైన తీర్చాలనుకున్న మనే భంజన్ బ్యాబ్సాయి (వ్యవసాయ) సమితికి చెందిన కార్యకర్తలు ట్రక్కు నిండ కూరగాయలు తెచ్చి డార్జిలింగ్ వాసులకు పంపిణీ చేశారు. వాటిని అందుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు.