ఈ సూపర్ బైక్‌ ధర రూ.8.5 లక్షలు

బ్రిటన్‌కు చెందిన సూపర్‌బైకుల తయారీ సంస్థ ట్రయింఫ్ మోటార్‌సైకిల్..దేశీయ మార్కెట్లోకి మరో సూపర్ స్పోర్ట్స్ బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. న్యూ స్ట్రీట్ త్రిపుల్ ఎస్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.8.5 లక్షలుగా నిర్ణయించింది. మానెసర్ అసెంబ్లింగ్ ప్లాంట్లో ఈ బైకును రూపొందించినట్లు ట్రయింఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విమల్ సుంబ్లీ తెలిపారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా వచ్చే ఏడాది ఇక్కడే 1,200 వాహనాలను తయారు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 765 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకులో డీఆర్‌ఎల్ హెడ్‌లైట్ సిస్టమ్ ఉంది.