ఈ మంత్రి గారికి జీఎస్టీ అంటే ఏంటో తెల్వదు!

ఇవాళ అర్థరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా.. జీఎస్టీని అమలు పర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంటే.. మరో  వైపు పలువురు ప్రజా ప్రతినిధులకు ఇప్పటికీ జీఎస్టీ గురించి సరైన అవగాహన ఉండడం లేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ జీఎస్టీ అమలుకు పూర్తి మద్దతు ప్రకటిస్తే.. మరో వైపు ఆయన సహచర మంత్రి రామ్‌పతి శాస్త్రి మాత్రం జీఎస్టీ ఫుల్‌ ఫామ్‌ను చెప్పడానికి కూడా  తటపటాయించారు. యూపీలోని మహారాజ్‌ జంగ్‌ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి రామ్‌పతి శాస్త్రిని విలేకరులు జీఎస్టీ అమలు గురించి పలు ప్రశ్నలు అడిగారు. జీఎస్టీ పై రామ్‌ పతికి ఎలాంటి అవగాహన లేదని వెల్లడైంది. అటు యూపీ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన మంత్రులకే.. జీఎస్టీపై సరైన అవగాహన లేకుంటే ఎలా అని విమర్శలు వినిపిస్తున్నాయి.