ఈ బంధం డెబ్బయ్యేళ్లది!

గత మూడేళ్లలో భారత్ కు వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో నెదర్లాండ్స్ మూడో స్థానంలో ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న మోడి, ఆ దేశ ప్రధాని మార్క్ రట్టెతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయ్యాయని, ఈ బంధం మరింత బలోపేతం అయ్యేందుకు తన పర్యటన సహకరిస్తుందన్నారు ప్రధాని. భారత అభివృద్ధిలో నెదర్లాండ్స్ సహజ భాగస్వామిగా ఉందన్నారు. నెదర్లాండ్స్ సహకారంతోనే మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ లో భారత్ కు సభ్యత్వం వచ్చిందన్న ప్రధాని, దానికి ధన్యవాదాలు తెలిపారు.