ఈ ఏడాది ప్రత్యేకం!

అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు బాలీవుడ్ నటుడు షారూఖ్. ఈద్ సందర్భంగా తన ఇంటి వద్దకు వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. ఈసారి ఈద్ వేడుకల్లో షారూక్ తనయుడు అబ్ రాం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తండ్రితో పాటు తెల్ల జుబ్బా వేసుకొని అభిమానులకు అభివాదం చేశాడు. బాలీవుడ్ కి వచ్చి 25 ఏళ్లు పూర్తైందని, దీంతో ఈ రంజాన్ తనకు ప్రత్యేకంగా మారిందన్నారు షారూఖ్‌. ఖాళీ సమయంలో మహా భారతం చదువుతున్నానని, తన కుమారుడికి దాంట్లోని విశేషాలను చెప్తున్నానని వెల్లడించారు.

షారుఖ్ తాజా సినిమా జబ్ హారీ మెట్ సెజల్ ట్రైలర్ అభ్యంతరకరంగా ఉందని జాతీయ సెన్సార్ బోర్డ్ చైర్మన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆ సినిమా ఇంకా సెన్సార్ కు వెళ్లనేలేదని, ఆయనెక్కడ చూశారని ప్రశ్నించారు. సినిమా చూస్తే ఆ అభిప్రాయం పోతుందన్నారు.