ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి రూపం ఇదే!

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఈ ఏడాది కూడా భారీ గణనాథుడు కొలువుతీరనున్నాడు. గణేష్ ఉత్సవ కమిటీ ఈ ఏడాది ఏర్పాటు చేయబోయే వినాయకుడి రూపాన్ని విడుదల చేసింది. శ్రీచండీకుమార అనంత మహాగణపతిగా 57 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. విగ్రహానికి కుడివైపున మహాశివుడు, ఎడమ వైపున మహిషాసురమర్ధిని రూపాలు దర్శనమివ్వనున్నాయని ఉత్సవ కమిటీ తెలిపింది.