ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జీఎస్‌ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం దేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు.