ఇష్టాయిష్టాలను ప్రదర్శించడం నచ్చదు!

‘‘నేను పరిశ్రమలోకి నటించడానికి వచ్చాను. ఏయే పాత్రలకు సరిపోతానో, ఎలాంటి పాత్రలు చేస్తే బావుంటానో నిర్ణయించాల్సింది దర్శకులు.. సినిమా విడుదలయ్యాక మార్కులేసే ప్రేక్షకులూ.. అంతే తప్ప ఇక్కడ నా ఇష్టాయిష్టాలను ప్రదర్శించడం నాకు నచ్చదు’’ అని చెప్పింది తమన్నా. అంతేకాదు ‘‘నేను ఇప్పటిదాకా పలు భాషల్లో నటించాను. వాటిలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలున్నాయి. గ్లామర్‌ ప్రధానమైనవీ ఉన్నాయి. నేను ఈ రెండు రకాల పాత్రలకూ న్యాయం చేయగలనని నమ్మిన దర్శకులు నా దృష్టిలో చాలా గొప్పవారు. వాళ్లు నా మీద నమ్మకంతో అలాంటి పాత్రలు రాశారు కాబట్టి నేను ప్రేక్షకుల ప్రశంసలకు అర్హురాలినయ్యాను. అందుకే ఎప్పుడూ దర్శకులకు రుణపడి ఉంటానని చెబుతుంటాను’’ అని చెప్పింది.  తన చుట్టూ ఉన్న వారు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో తాను కూడా మాట్లాడటానికి ప్రయత్నించడం వల్లనే తెలుగు, తమిళ్‌ నేర్చుకున్నానంది.