ఇరాన్‌లో ఉగ్రదాడులు

ఇరాన్ రాజధాని ఉగ్రదాడులతో వణికిపోయింది. వరుసగా మూడు  చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.  మొదటగా ఇరాన్ పార్లమెంట్ లోకి చొరబడ్డ ముగ్గురు దుండగులు.. కాల్పలకు తెగబడ్డారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. పార్లమెంట్ భవనం లోపల పలువురిని దుండగులు బందీలుగా తీసుకున్నారు. మరోవైపు కోమైనీ ప్రార్ధనా మందిరం వద్ద రెండు చోట్ల దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. మందిరం బయట ఓ ఉగ్రవాది ఆత్మాహుతికి పాల్పడగా.. మరో ముగ్గురు లోపలికి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘటనతో టెహ్రాన్ లో అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.