ఇన్ఫోసిస్‌ను వెనక్కినెట్టిన మారుతి

కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ మార్కెట్‌ క్యాప్‌ జోరుగా పెరుగుతోంది. తాజాగా ఈ సంస్థ మార్కెట్‌ క్యాప్‌ పరంగా ఇన్ఫోసిస్‌, ఔన్‌జిసి కంపెనీలను అధిగమించింది. తాజాగా మారుతి షేరు ధర 3 శాతం మేర వృద్ధి చెందడంతో మార్కెట్‌ విలువ 6,563 కోట్ల రూపాయలు పెరిగింది. బిఎస్ ఇలో మారుతి షేరు ధర 7,451 రూపాయలకు చేరుకోగా.. ఎన్‌ఎస్‌ఇలో షేరు ధర 7,464.85 రూపాయల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో మారుతి మార్కెట్‌ క్యాప్‌ 6,562.85 కోట్ల రూపాయలు పెరిగి 2,25,079.85 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో మార్కెట్‌ క్యాప్‌ పరంగా టాప్‌ 10లో ఉన్న కంపెనీల్లో మారుతి 8వ స్థానానికి చేరుకుంది. ఇక ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువ ప్రస్తుతం 2,17,899.66 కోట్ల రూపాయలుండగా.. ఔన్‌జిసి మార్కెట్‌ విలువ 2,17,074.17 కోట్ల రూపాయలుగా ఉంది.