ప్రతిరోజూ పెట్రో ధరల్లో మార్పులు

అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా రోజువారీ ధరల్లో మార్పులు చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే  ఐదు నగరాల్లో రోజువారీ మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకపోవడంతో.. ధరల మార్పులకు ఐవోసీ శ్రీకారం చుట్టింది. ఇక మిగిలిన ఆయిల్ కంపెనీలు కూడా ఐవోసీ బాటలో నడిచే అవకాశముంది. ప్రస్తుతం ప్రతీ 15 రోజులకు ఒకసారి చమురు సంస్థలు ధరల్లో మార్పులు చేస్తున్నాయి.