ఇండోనేషియా ఓపెన్ విజేత శ్రీకాంత్

ఇండోనేషియో ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ లో కిదాంబి శ్రీకాంత్‌ అద్భుత విజయం సాధించాడు. ఫైనల్లో జపాన్‌ ప్లేయర్ కజుమస సకాయ్‌ పై 21-11, 21-19 తేడాతో గెలిచి టోర్నీ విజేతగా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన తొలి సెట్‌ లో శ్రీకాంత్‌ జపాన్‌ ప్లేయర్‌కు చుక్కలు చూపించాడు. బలమైన షాట్ లు, స్మాష్‌ లతో బెంబేలెత్తించాడు. ఇదే ఊపులో 21-11 స్కోరుతో తొలి సెట్‌ ను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్‌ హోరాహోరీగా సాగింది. ఇరువురు నువ్వానేనా అన్నట్లు పాయింట్లను సాధించారు. ఐతే, స్కోరు 19 ఆల్‌ ఉన్న సమయంలో దూకుడుగా ఆడిన శ్రీకాంత్‌ వరుసగా రెండు పాయింట్లు సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.