ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మే 15 నుంచి 22 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు.  ఈ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. మహబూబాబాద్‌, మెదక్‌ జిల్లాలు చివరి స్థానాల్లో నిలిచాయని అధికారులు చెప్పారు.  అటు ఇంటర్‌ మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ షెడ్యూల్‌ ను అధికారులు విడుదల చేశారు. ఈ యేడాది ఆఫ్‌ లైన్‌ లోనే అడ్మిషన్స్‌ చేపడుతున్నట్టు ప్రకటించారు. జూన్‌ 6వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని.. జూన్‌ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. జూన్‌ నెల 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నరు.