ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి 21 వరకు విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని ఆయన తెలిపారు. 16 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చని చెప్పారు. జూన్ 28న ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. జులై 3వ తేదీ లోపు విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో చేరాలని చెప్పారు. ఇతర వివరాల కోసం www.tseamcet.nic.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావొచ్చని తెలిపారు.