ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత శ్రీకాంత్

ఆస్ట్రేలియన్‌ బ్యాడ్మింటన్‌ సిరీస్‌ను.. కిదాంబి శ్రీకాంత్‌ గెలుచుకున్నాడు. మెన్స్‌ సింగిల్స్‌ లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ చెంగ్‌ లాంగ్‌ పై 22-20, 21-16 తేడాతో గెలుపొందాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ లో తొలి మ్యాచ్‌ నుంచే జోరు మీదున్న శ్రీకాంత్‌.. ఫైనల్‌ లోనూ సత్తా  చాటాడు. రెండు సార్లు వరల్డ్‌ ఛాంపియన్‌ అయినా.. చెంగ్‌ లాంగ్‌ పై వరుస సెట్లలో మట్టి కరిపించాడు.