ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడింది

మూడేళ్ల ఎన్డీఏ పాలనలో ఎన్నో విజయాలను సాధించామని కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మోడీ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై ప్రోగ్రెస్  రిపోర్టును ప్రకటించిన ఆయన.. తమ పాలనలో ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడిందన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో అవినీతిని తగ్గించామని తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత పన్ను వసూళ్లు బాగా పెరిగాయని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్‌ ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ గా ఉందని జైట్లీ వెల్లడించారు.