ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ రెడ్‌మీ-4  

షియోమీ తన ‘రెడ్‌మీ 4’ స్మార్ట్‌ఫోన్‌ను గత మే నెలలో విడుదల  చేసింది. ఈ ఫోన్‌ను ఇప్పటి వరకు షియోమీ అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్స్‌లో కేవలం ఫ్లాష్ సేల్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నది. ఈ క్రమంలోనే రెడ్‌మీ 4 పట్ల చాలా మంది యూజర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్నో లక్షల మంది ఈ ఫోన్‌ను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఫోన్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా యూజర్ల సౌకర్యార్థం రెడ్‌మీ 4ను ఆఫ్‌లైన్ స్టోర్స్ లోనూ విక్రయించనున్నారు. రేపటి నుంచి ఈ ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో లభ్యమయ్యే అవకాశం ఉంది. 2/3/4 జీబీ ర్యామ్‌, 16/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ వ‌రుస‌గా రూ.6,999, రూ.8,999, రూ.10,999 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. షియోమీ రెడ్‌మీ 4 ఫీచర్లు.. 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.