ఆప్ఘాన్‌లో ఉగ్ర ఘాతుకం, 10 మంది జవాన్లు మృతి

ఆప్ఘానిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. హెరత్   ప్రావిన్స్‌   లోని సల్మా డ్యామ్‌  లక్ష్యంగా  చెక్‌  పాయింట్‌   పై దాడి  చేశారు. ఈ ఘటనలో 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా… మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే అలర్టయిన బలగాలు.. దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు.  సల్మా హైడ్రో ఎలక్ట్రిక్  డ్యామ్‌    ప్రాజెక్టును 2016లో ప్రధాని మోడీ ప్రారంభించారు. దీన్ని భారత ఆర్థిక సాయంతోనే నిర్మించారు. ఈ డ్యామ్‌   ను టార్గెట్   చేసుకుని ఉగ్రవాదులు  దాడికి పాల్పడినట్టు అక్కడి అధికారులు చెప్తున్నారు.