ఆది మూవీకి తలసాని క్లాప్‌!

ఆది, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ నివ్వగా, నిర్మాత ఉప్పలపాటి శ్రీచరణ్ తల్లిదండ్రులు ఉప్పలపాటి రామకృష్ణ, అనురాధ కెమెరా స్విచ్‌ ఆన్ చేశారు. ఈ చిత్రానికి విశ్వనాథ్ అరిగెల దర్శకుడు. ఉప్పలపాటి సత్యనారాయణ ప్రొడక్షన్స్, విజయలక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఉప్పలపాటి చరణ్‌తేజ్, గుర్రం విజయలక్ష్మి నిర్మిస్తున్నారు. “కె.విశ్వనాథ్‌గారి సినిమాల్లో స్వర్ణకమలం అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్రంలోని భానుప్రియ పాత్ర అంటే మరీ ఇష్టం. అలాంటి పాత్రతో సినిమా చేయాలనుకున్నప్పుడు శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం వున్న శ్రద్ధాశ్రీనాథ్ అయితేనే కరెక్ట్ అనిపించింది. అందుకే ఆమెను కథానాయికగా తీసుకున్నాం. ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం” అని దర్శకుడు అన్నారు.