అస్తానా చేరుకున్న ప్రధాని మోడీ

రెండ్రోజుల విదేశీ పర్యటనలో భాగంగా  ప్రధాని నరేంద్ర మోడీ కజకిస్థాన్ చేరుకున్నారు.  ఢిల్లీ ఎయిర్  పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన ఆ దేశ రాజధాని అస్తానా చేరుకున్నారు.  రేపు షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్  సమ్మిట్ లో పాల్గొంటారు. అక్కడే  చైనా ప్రెసిడెంట్‌ జీ జింపింగ్‌ తో సమావేశమయ్యే అవకాశం ఉంది.