అమెరికాపై రష్యా తీవ్ర ఆరోపణలు

అమెరికాపై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. సిరియాలో మరోసారి రసాయన దాడులు జరిగేలా అమెరికా రెచ్చగొడుతోందని రష్యా విదేశాంగ శాఖ ఫైరైంది. సిరియా అధ్యక్షుడు అసద్‌ అల్ బషర్‌…రసాయనిక దాడులు చేస్తారంటూ కావాలనే నిందలు మోపుతున్నారని విమర్శించింది. దాడుల జరగకుండానే ప్రపంచాన్ని నమ్మించేలా ఫేక్‌ వీడియో ఒకటి తయారు చేసి సిద్ధంగా ఉంచినట్లు సమాచారం ఉందని రష్యా తెలిపింది. గతంలో సిరియాలో రసాయన దాడులు జరిగిన తర్వాత అసద్‌ ప్రభుత్వంపై అమెరికా దాడులు జరిపింది. మరోసారి అలాంటి దాడులు చేసేందుకే అసద్‌ పై అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మండిపడింది.