అమెరికాకు అత్యంత సన్నిహిత దేశం భారత్‌ 

భారత్‌  అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు.  భారత్‌ అత్యున్నత సంప్రదాయాలు, ఆచారాలు కలిగిన దేశమన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం కొనసాగుతుందన్న అమెరికా ప్రెసిడెంట్‌.. ఇండియా ప్రపంచంలోనే ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అభివర్ణించారు. భారత్‌- అమెరికాలు తీవ్రవాద ప్రభావిత దేశాలని.. ఇరు దేశాలు ఉగ్రవాంపై ఉక్కుపాదం మోపుతాయన్నారు. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదులను వదలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. ఇంధన వనరుల్లో ఇరు దేశాలు మరింత అభివృద్ధి సాధించాలని చెప్పారు. సహజవాయు కొనుగోలు ఒప్పందం కొనసాగించాలని ఆకాంక్షించారు. అమెరికాలో కూడా త్వరలో కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. వైట్‌హౌస్‌లో సమావేశం అనంతరం రోజ్ గార్డెన్‌లో ట్రంప్, మోడీ సంయుక్త ప్రకటన చేశారు.