అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు

బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రులు  తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం బాసర బస్టాండ్ నుంచి పి.డబ్ల్యు.డి రోడ్డు వరకు  రూ. 4 కోట్ల 50 లక్షల ఖర్చుతో నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. బిద్రెల్లిలో రూ.5 కోట్ల ఖర్చుతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. బడ్జెట్‌ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 2 వేల కోట్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌  దేనని చెప్పారు.

ఈ కార్యక్రమాల్లో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.