అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాల ఆరోపణలు

రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎంపీ బాల్క సుమన్‌ అన్నారు. అది చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర వికలాంగుల కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వాసుదేవ రెడ్డిని అభినందిస్తూ వరంగల్‌ లో ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కుటుంబంపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్‌ విసిరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ తో పాటు రాష్ట్ర మహిళా కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుండు సుధారాణి, పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.