అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు మంత్రి మహేందర్‌ రెడ్డి. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మంత్రి మహేందర్‌ రెడ్డి పర్యటించారు. మాడుగుల, అవుర్‌, ఆమన్‌ గల్‌ గ్రామాల్లో పాఠశాలల అదనపు గదులు, అంగన్‌ వాడీ, గ్రామపంచాయతీ, స్త్రీ శక్తి భవనాలతో పాటు వ్యవసాయ గిడ్డంగి భవనాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతీ పల్లెకు రోడ్డు సదుపాయం కల్పిస్తామన్నారు.

స్థానిక ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.